హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీలో భాగంగా జేఎల్ ఎకనామిక్స్ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఎకనామిక్స్, ఎకనామిక్స్(ఉర్దూ మీడి యం) పోస్టులకు ఎంపికైన వారి ఫలితాలను ప్రకటించింది. వివరాలను వెబ్సైట్లో పొందుపరిచినట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.
ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తేతెలంగాణ): ఇంటర్ ప్రథమ, ద్వితీయ రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థుల పరీక్ష ఫీజు గడువును ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. ఈనెల 27 వరకు గడువు ఉండగా, డిసెంబర్ 3వరకు పొడిగించినట్టు బోర్డు కార్యదర్శి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 జరిమానాతో డిసెంబర్ 12, రూ.500 జరిమానాతో డిసెంబర్ 17, రూ. వెయ్యి జరిమానాతో డిసెంబర్ 24, రూ.2వేల జరిమానాతో జనవరి 1 వరకు ఇంటర్ పరీక్ష పీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.