హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : వంట నూనెలు, ఆరోగ్యకరమైన కొవ్వులపై పరిశోధనలు చేసే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలోని చీఫ్ సైంటిస్ట్ ప్రభావతికి జేజీ కన్నే అవార్డు వరించింది. ఆయిల్ టెక్నాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.. ఈ రంగంలో విశేష కృషితోపాటు ఆధునిక టెక్నాలజీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన పరిశోధకులకు ప్రొఫెసర్ జేజీ కనే స్మారక పురస్కారంతో సత్కరిస్తున్నది. 2022 ఏడాదికి ఈ అవార్డును డాక్టర్ ప్రభావతి దేవీ దక్కించుకొన్నారు. కాగా, ఆమె ఎంపికపై ఐఐసీటీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.