హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): జీవో 59 క్రమబద్ధీకరణ చలానా చార్జీలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దరఖాస్తు చేసిన తేదీ నాటికి మార్కెట్ విలువ ఆధారంగా చలానా చెల్లించాలని రెవెన్యూ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2014 జూన్ 2వ తేదీ నాటికి ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న వారి స్థలాలను క్రమబద్ధీకరించాలని గతంలో నిర్ణయించింది. మొదటిసారి ఇచ్చిన అవకాశాన్ని కొందరు వినియోగి ంచుకోగా, మిగిలిన వారికి మరోసారి అవకాశం ఇచ్చింది. వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని, ఈ నెలలోగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.