హైదరాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో జార్ఖండ్ వ్యవసాయశాఖ మంత్రి శిల్పి నేహా తెర్కే ఆదివా రం భేటీ అయ్యారు. ఎన్ఎంఆర్ఐ, ఎఫ్డీబీ, ఐఐఎంఆర్ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆమె సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరు రాష్ర్టాల్లో వ్యవసాయ సంబంధిత అంశాలపై సవివరంగా చర్చించారు.
నిచినోను సందర్శించిన బృందం..
జపాన్లో పర్యటిస్తున్న ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, డైరెక్టర్ గోపీతోపాటు అధికారుల బృందం ఆదివారం ప్రముఖ ఆగ్రో కెమికల్ సంస్థ నిచినోను సందర్శించారు. ఈ సందర్భంగా పురుగు మందులు, శిలీంద్ర వినాశకాలపై జరుగుతున్న పరిశోధనలను తెలుసుకున్నారు. తెలంగాణలో వ్యవసాయరంగ అభివృద్ధికి నిచినో సంస్థతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని చిన్నారెడ్డి తెలిపారు