హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : తెలుగు రాష్ర్టాల నుంచి ఓపెన్ క్యాటగిరీలో 18వ ర్యాంకు సాధించి తెలుగోడి సత్తా చాటాడు నారాయణ విద్యాసంస్థలకు చెందిన కాకర్ల జీవన్ సాయికుమార్. అలాగే సౌత్ ఇండియాలో ఫస్ట్ ర్యాంకు సాధించి సంచలనం సృష్టించాడు. దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన జీవన్ సాయికుమార్ కుటుంబం హైదరాబాద్‌లో స్థిర పడింది. తండ్రి గంగాధర నాగకుమార్ మల్లా రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్. తల్లి నళినీదేవి గృహిణి. జీవన్ సాయి కుమార్ చదువంతా నారాయణ విద్యాసం స్థల్‌లోనే సాగింది. 6వ తరగతి నుంచి నారాయ ణ సీవో స్కూల్లో చదవగా, సీబీఎస్ఈలో టెన్త్‌లో 90%, ఇంటర్ మాదాపూర్ నారాయణ కాలేజీలో చదవగా, 98% మార్కులొచ్చాయి. అక్కడే నీట్ శిక్షణ తీసుకున్నాడు.
విశ్లేషిస్తూ చదివితే విజయం
చిన్నతనం నుంచే వైద్యరంగమంటే ఇష్టం. దానికి నా తల్లిదండ్రులే ప్రేరణ. సా ధారణంగా స్టడీస్‌లో నేను సగటు విద్యార్థి నే. కానీ వైద్యరంగంపై మక్కువతో చదివా. ఆలిండియా ర్యాంకు కోసం అహర్నిశలు కష్టపడ్డా. నీట్‌కు సన్నద్ధమవ్వాలంటే ఏ విషయమైనా పూర్తి అవగాహన వచ్చేలా విశ్లేషిస్తూ చదవాలి. దీనికి నారాయణ పరీక్ష విధానం, మార్కుల విశ్లేషణ, సందేహాల నివృత్తి, మైక్రోషెడ్యూల్, ఎర్రర్ లిస్టు, రివిజన్ ప్రోగ్రామ్ ఎంతగానో సహాయపడింది. ఈ ఏడాది నీట్ పరీక్ష ఎంతో సంక్లిష్టంగా ఉంది. అందులో 720 మార్కులకు 670 మార్కులు దాటానంటే సాధారణ విషయం కాదు. ప్రతి ప్రశ్ననూ ఎదుర్కొనే విషయ పరిజ్ఞానం ఉండాలి.నాకు నారాయణ గైడెన్స్‌తోనే సాధ్యమైంది. అదే నాకు ఆలిండియా 18వ ర్యాంకు తెచ్చిపెట్టింది.
– కాకర్ల జీవన్ సాయికుమార్,ఆలిండియా 18వ ర్యాంకు