Jeevan Reddy | అన్నా నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని.. జీవన్‌రెడ్డి భావోద్వేగం
Jeevan Reddy | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
సిద్దిపేట : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) ను మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ( Jeevan Reddy) శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి కేసీఆర్‌ను పలకరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘ అన్నా.. నన్ను దేవుడే పంపిండు. మీతో కలిసి పని చేయమని’ అంటూ కేసీఆర్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి , కుమారులు, జగిత్యాల జడ్పీ మాజీ చైర్ పర్సన్ వసంత సురేశ్ దంపతులు కేసీఆర్‌ను కలిసినవారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి తొలిసారి వచ్చిన జీవన్ రెడ్డిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డా. కె.సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.

‘ తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరమున్నదని, మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను మీదగ్గరికి పంపించిండు. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్ల కైనా మీతో కలిసిపనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది’ అంటూ మనసులోని మాటను వ్యక్తం చేశారు. ఈ సంద్భంగా జీవన్‌రెడ్డిని కేసీఆర్ సన్మానించారు.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

