Congress | హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తె లంగాణ): జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడి హత్య. సొంతపార్టీపైనే జీవన్‌రెడ్డి తీవ్ర ఆ గ్రహం. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా మారాయని విమర్శ. ఏకపక్ష చేరికలపై మండిపాటు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని డిమాండ్. ఆక్రోశం అంతా వెల్లగక్కుతూ అధిష్ఠానానికి సుధీర్ఘ లేఖ. దీంతో రాష్ట్రంలో ఒంటెద్దు పోకడ విధానాలపై కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ పరిణామా ల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ శుక్రవారం హస్తినకు పయనం కావడం ప్రాధాన్యత సంతరించుకుం ది.
అసలు రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతున్న దంటూ ఆరా తీయడానికే మహేశ్‌కుమార్ గౌడ్‌ను ఢిల్లీకి పిలిచినట్టు సమాచారం. ఈ పర్యటనలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను వివరించనున్నారు. పార్టీ సంస్థాగత విషయాలను వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు. టీపీసీసీ కమిటీల కూ ర్పుపైనా చర్చించి అనుమతి తీసుకోనున్నా రు. జీవన్‌రెడ్డి విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంపైనా పార్టీ పెద్ద ల సూచనలు తీసుకోనున్నట్టు వినికిడి. శనివారం సాయంత్రం ఢిల్లీలో వీహెచ్ పుస్తకావిష్కరణలో పాల్గొనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు పయనం కానున్నా రు. ఇంతకుముందు సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన మహేశ్ కుమార్‌గౌడ్.. ఈ సారి ఒక్కరే హస్తినకు వెళ్లడంపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతున్నది.
జీవన్‌రెడ్డి ఒంటరి కాదు..
పట్టభద్రుల ఎమ్మెల్సీ, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నికార్సయిన కాంగ్రెస్ వాది అని, ఇటీవల అనుచరుడి హత్య విషయంలో ఆయన ఆవేదనను చూసి చాలా బాధ కలిగిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. జీవన్‌రెడ్డి ఒంటరి కాదని, కష్టకాలంలో ఉన్న ఆయనకు అండగా ఉంటానని స్పష్టంచేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఏమి జరుగుతున్నదో తెలియడంలేదని, నిత్యం జనాల మధ్య ఉండే జీవన్‌రెడ్డికి జీవితమంతా కష్టాలేనని శుక్రవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.