హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్స్-1 సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. అభ్యర్థులు ఏ పట్టణంలో పరీక్ష రాయబోతున్నారో తెలిపే స్లిప్స్‌ను వెబ్సైట్లో పెట్టింది.
ఈ నెల 22 నుంచి 29 వరకు పేపర్-1(బీఈ, బీటెక్), 30న పేపర్ 2ఏ, 2బీ పేపర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు. అడ్మిట్‌కార్డుల విడుదలకు ముందు ఏటా ఈ స్లిప్స్‌ను ఎన్టీఏ విడుదల చేస్తున్నది. పరీక్షకు వారం రోజుల ముందు అడ్మిట్‌కార్డులను వెబ్సైట్లో పెడతారు.