హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్-1 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రస్తుతం బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌గా నిర్వహిస్తారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్-1 పరీక్షలకు 13.8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ల్యాబులున్నాయా..? ఫ్యాకల్టీ ఉన్నారా..? ; ప్రైవేట్ కాలేజీల్లో వసతులపై ఇంటర్‌బోర్డు ఆరా
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ల్యాబులున్నాయా..? ఫ్యాకల్టీ ఉన్నారా..? సీసీ కెమెరాలున్నాయా? అని ఇంటర్‌బోర్డు ఆరా తీస్తున్నది. కాలేజీల్లో వసతులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, డిక్లరేషన్ ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాలను ఆదేశించింది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రైవేట్ కాలేజీల్లోను సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగనున్నాయి.