Jayaprakash Narayana | గాంధీ వల్ల దేశానికి స్వాతంత్య్రం రేలే.. బ్రిటిష్ వాళ్లు ఎలాగూ భారత్‌ను వదిలి వెళ్లిపోయేవారే: జయప్రకాశ్ నారాయణ
భారత్‌కు మహాత్మాగాంధీ వల్ల స్వాతంత్య్రం రాలేదని, బ్రిటిష్ వాళ్లు ఎలాగూ భారత్‌ను వదిలి వెళ్లిపోయేవారని మాజీ ఐఏఎస్, లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): భారత్‌కు మహాత్మాగాంధీ వల్ల స్వాతంత్య్రం రాలేదని, బ్రిటిష్ వాళ్లు ఎలాగూ భారత్‌ను వదిలి వెళ్లిపోయేవారని మాజీ ఐఏఎస్, లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం బంజారాహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సిటిజన్ గ్రూప్ ఆధ్వర్యంలో రెండో రోజు నిర్వహించిన యూత్ పార్లమెంట్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా యువత అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. గాంధీ లేకపోయినా స్వాతం త్య్రం వచ్చేదని, దేశ సమైక్యత ఆయన వల్లే సాధ్యమైందని వ్యాఖ్యానిం చారు. ఈ వ్యాఖ్యలతో కొందరు గందరగోళానికి గురయ్యారు.
సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ లక్ష్యాలు గొప్పగా ఉంటున్నా, కొందరు వారి ప్రయోజనాలకు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. రాజకీయాల్లోకి రావాలంటే చదువు అడ్డు కాదని, ప్రశ్నించే విధానం రావాలని వెల్లడించారు. ఇక్కడ ఒక నియోజ కవర్గంలో ఎన్నికల కోసం పెట్టే ఖర్చు.. బ్రిటన్‌లో ఎన్నికల మొత్తంతో సమానం అవుతుందని వివరించారు. సమావేశానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి మహమూద్ అలీ, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ శ్రీనివాస్, ఎంపీ లక్ష్మణ్, ప్రముఖ జర్నలిస్టు రామచంద్రమూర్తి, సిటిజన్ గ్రూప్ సీఈవో స్వాతి చంద్రశేఖరన్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
Rising Stars Asia Cup: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీ.. జట్టులో అభిషేక్, వైభవ్
RJD Somireddy | విద్యా ప్రమాణాల పెంపునకు సమష్టి కృషి చేయాలి : ఆర్జేడీ సోమిరెడ్డి
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

