హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ వర్సిటీలో పలు కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్నది. 2023-24 విద్యా సంవత్సరంలో ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఏడీఈఈ) షెడ్యూల్ను వర్సిటీ అధికారులు ఇటీవల విడుదల చేశారు. విద్యార్థులు జూన్ 5 వరకు www.jnafau.ac.in, www. jnafauadmissions.com వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. రూ. 2 వేల ఆలస్య రుసుముతో జూన్ 12 వరకు దరఖాస్తు చేసుకో వచ్చు. అదే నెల 17, 18 తేదీల్లో ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తారు. ఉత్తీర్ణులైన వారికి ఫొటోగ్రఫీ, ఇంటీరియర్ డిజైన్, అప్లయిడ్ ఆర్ట్, పెయింటింగ్ తదితర బ్యాచిలర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
తగ్గుతున్న సీట్లు
వర్సిటీతో పాటు అనుబంధ ప్రైవేట్ కాలేజీల్లో కొంతకాలంగా సీట్ల సంఖ్య తగ్గుతున్నది. 2014-5 నుంచి 2017-18 వరకు సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగి 45 శాతానికి చేరుకోగా, ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుతున్నాయి. 2017-18లో అత్యధికంగా 2,258 సీట్లుండగా, 2021-22 నాటి కి 953కి పడిపోయాయి. 2022-23లోనూ సీట్లు వెయ్యిలోపే ఉన్నాయి. అయితే కోర్సుల్లో చేరే అ మ్మాయిల సంఖ్య మాత్రం పెరుగుతున్నది. 2016-17లో 36 శాతం మంది అమ్మాయిలుండగా, 2020-21కి ఆ సంఖ్య 55 శాతానికి చేరింది.
P3