మణికొండ, జూన్ 19: మణికొండలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నూతన కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఈ కార్యాలయం కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ మరింత చురుకుగా వ్యవహరిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.