హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): దేశంలోని విద్యాసంస్థలకు జారీచేసే నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఆఫ్)ను శుక్రవారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ విడుదల చేశారు. తెలంగాణ విద్యాసంస్థలు ఈ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాయి. ఉస్మానియా, నైపర్, నల్సార్, నిట్ వరంగల్, ఐఐటీ హైదరాబాద్ ఉత్తమ ర్యాంకులను సొంతం చేసుకొన్నాయి. ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్ 14, ఉస్మానియా వర్సిటీ 46వ స్థానంతో ర్యాంకులను మెరుగుపర్చుకొన్నాయి. వర్సిటీ ర్యాంకింగ్స్‌లోను ఓయూ 10 ర్యాంకులను మెరుగుపర్చుకొని 22వ ర్యాంకును కైవసం చేసుకొన్నది.