ACB : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జీఎం అనంత్ లక్ష్మీకుమార్(Anant Laxmi Kumar) అరెస్ట్ అయ్యారు. మంగళవారం పలుచోట్ల తనిఖలు చసిన ఏసీబీ అధికారులు కుమార్ను అదుపులోకి తీసుకన్నారు. కుమార్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు.
హైదరాబాద్లోని అనంత్ లక్ష్మీకుమార్ నివాసంతో పాటు అతని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 8 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. నిజామాబాద్, సంగారెడ్డిలో కుమార్ పేరిట 18 ఎకరాల సాగు భూమి. హైదరాబాద్లో 8 ప్లాట్లు ఉన్నట్టు గుర్తించారు. సోదాల్లో రూ. 1.10 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు 2.1 కిలోల బంగారం. 9.2 కిలోల వెండి వస్తువులను సీజ్ చేశారు.
మంగళవారం పట్టుబడిన డబ్బు, బంగారం, వెండితో పాటు సాగు భూములు కలిపి విలువ 5.88 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. మార్కెట్ విలువ మరింత ఎక్కువుండే అవకాశముందని చెబుతున్నారు. విచారణలో కుమార్ అవినీతి చిట్టా, అక్రమాస్తుల వివరాలు బయటపడనున్నాయి.