కొత్త సీఎస్ సంజయ్ జాజు.. కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్
తదుపరి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజు నియమితులయ్యే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజును కేంద్ర ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఆయనను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
- 12 ఏండ్ల విరామం తర్వాత తిరిగి రాష్ట్ర సర్వీసులకు రాక
- తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే రిలీవ్ చేశామన్న కేంద్రం
- తదుపరి సీఎస్ అంటూ ప్రచారం
హైదరాబాద్, జూన్ 23(నమస్తే తెలంగాణ) : తదుపరి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజు నియమితులయ్యే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజును కేంద్ర ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఆయనను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సంజయ్ జాజును రిలీవ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు ఉద్యోగకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడటం చర్చనీయాంశంగా మారింది.
సీఎస్ రేసులో సీనియర్ అధికారులైన సంజయ్ జాజు, వికాస్‌రాజ్, జయేశ్‌రంజన్ ఉన్నారు. అయితే, సంజయ్ జాజు కేంద్ర సర్వీసుల్లో ఉండటంతో ఇక పోటీ వికాస్‌రాజ్, జయేశ్‌రంజన్ మధ్య ఉన్నదనే చర్చ జరిగింది. హఠాత్తుగా సంజయ్ జాజు కేంద్ర సర్వీసుల నుంచి రాష్ర్టానికి వస్తుండటం, అది కూడా రాష్ట్ర విజ్ఞప్తి మేరకే ఆయనను రిలీవ్ చేస్తున్నట్టు కేంద్రం పేర్కొనడం సంచనలంగా మారింది. ఈ నేపథ్యంలో తదుపరి సీఎస్ సంజయ్ జాజు అనే ప్రచారం జోరందుకున్నది. ఇదే జరిగితే ఇప్పటివరకు సీఎస్ పోస్టుపై గంపెడు ఆశలు పెట్టుకున్న జయేశ్‌రంజన్‌కు ఆశాభంగం తప్పదనే చర్చ జరుగుతున్నది.
1992 బ్యాచ్ తెలంగాణ క్యాడర్‌కు చెందిన సంజయ్ జాజు 12 ఏండ్లుగా కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారు. 2014 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు ఆయన కేంద్ర సర్వీసుల్లోనే ఉన్నారు. 2014 నుంచి 2018 వరకు నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత 20218-2023 వరకు భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం నార్త్ ఈస్ట్ రీజియన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

