శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 8: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జైలర్ సిని మా విలన్ వినాయకన్‌ను అరెస్ట్ చేసిన ఘటన శనివారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కొచ్చి నుంచి శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన వినాయకన్ మద్యం మత్తులో సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బందిపై దాడికి యత్నించాడు. దీంతో సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకొని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. సినిమాలో విలన్‌గా నటించిన ఆయన నిజ జీవితంలోనూ విలన్‌గా వ్యవహరించినట్టు తెలుస్తున్నది. దీంతో అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు వివరించారు.