తెలంగాణలో ఆటవిక రాజ్యం
తెలంగాణ రాష్ట్రంలో ఆటవిక, అరాచక రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి పోలీసుల చిత్రహింసలకు గురైన యువకుడు ధనావత్ సాయిసిద్ధును అదే మండలంలోని కొత్తపేట తండాలో బుధవారం ఆయన పరామర్శించారు.
- కాంగ్రెస్ పాలనలో ఇండ్లు కూల్చడం, జైల్లో పెట్టడం నిత్యకృత్యమైంది
- కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతో అమాయక ప్రజలపై కేసులు
- సంపాదనలో రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు
- ఢిల్లీకి మూటలు మోసే పనిలో సీఎం
- మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ధ్వజం
దామరచర్ల, సెప్టెంబర్ 24 : తెలంగాణ రాష్ట్రంలో ఆటవిక, అరాచక రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి పోలీసుల చిత్రహింసలకు గురైన యువకుడు ధనావత్ సాయిసిద్ధును అదే మండలంలోని కొత్తపేట తండాలో బుధవారం ఆయన పరామర్శించారు. తన ఇంటికి జగదీశ్‌రెడ్డి ఇతర నేతలు చేరుకోగానే సాయిసిద్ధు, ఆయన భార్య భూమిక కన్నీటిపర్యంతం అయ్యారు. వారి ఎదుట తనకు జరిగిన అన్యాయాన్ని దుఃఖభారంతో వివరించారు. అనంతరం జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేక సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులను అడ్డంపెట్టుకొని అరాచక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పేదల ఇండ్లను కూలగొట్టడం, కేసులు పెట్టి జైళ్లకు పంపే చర్యలు రాష్ట్రంలో నిత్యకృత్యంగా మారిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు వారి సంపాదనల్లో, కమీషన్లు దండుకోవడంలో మునిగిపోయారని ఆరోపించారు. తన పదవిని కాపాడుకునేందుకు సంపాదనలో 20 శాతం ఢిల్లీకి, రాహుల్‌గాందీ, మోదీకి సమర్పించుకొనే పనిలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు ప్రతి సమస్యపై ఆర్తనాదాలు పెట్టాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో అమాయకులపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. కొందరు పోలీస్ అధికారులు సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఎస్సీలు ఐపీఎస్ అధికారులుగా గుర్తెరగాలని, కింది స్థాయి అధికారులను నియంత్రించాలని కోరినా మార్పు రావడం లేదని తెలిపారు. కొత్తపేట తండాకు చెందిన గిరిజన యువకుడు సాయిసిద్ధు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడని, తండాకుయూరియా కోసం ఆటోలో వెళ్లి అక్కడ చేస్తున్న ధర్నాలో పాల్గొన్నాడనే వీడియో చూపుతూ పోలీసులు గంటసేపు అక్రమంగా కొట్టారని తెలిపారు. అమాయకుడిని ర్బంధించి గంటలకొద్దీ లాఠీలతో కొట్టే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. జగదీశ్‌రెడ్డి వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్, తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాకేశ్‌రెడ్డి, నలమోతు సిద్ధార్థ, చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, కే వీరకోటిరెడ్డి, ప్రకాశ్‌నాయక్, వీరూనాయక్, రవీందర్‌నాయక్, సచిన్, అమృనాయక్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
RC 17 Begins | పాన్-ఇండియా రేంజ్లో రామ్‌చరణ్ – సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరు!
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

