కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే కరువు.. పంటలు ఎండుతున్నా పట్టని సర్కార్
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. మొత్తం రైతాంగం దారుణమైన పరిస్థితిలో ఉన్నదని ఆవేదన చెందారు. హైదరాబాద్ నుంచి మునుగోడుకు వస్తుంటే కనుచూపు మేరలో ఎక్కడ చూసినా ఎండిపోయిన వరి, పత్తి పంటలే కన్పించాయని, వాటిని చూస్తే కండ్లల్లో నీళ్లుతిరిగాయని అన్నారు.
- ఐదు గంటల కరెంట్ కూడా ఇవ్వట్లే
- మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపైనే ధ్యాస
- ఇక్కడికి ఒక్క మంత్రిని కూడా రానివ్వని రాజగోపాల్‌రెడ్డి
- నీళ్లందించకపోవడంతో మళ్లీ ఫ్లోరైడ్ కేసుల నమోదు
- చండూరు సభలో జగదీశ్‌రెడ్డి
చండూరు, అక్టోబర్ 25 : కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. మొత్తం రైతాంగం దారుణమైన పరిస్థితిలో ఉన్నదని ఆవేదన చెందారు. హైదరాబాద్ నుంచి మునుగోడుకు వస్తుంటే కనుచూపు మేరలో ఎక్కడ చూసినా ఎండిపోయిన వరి, పత్తి పంటలే కన్పించాయని, వాటిని చూస్తే కండ్లల్లో నీళ్లుతిరిగాయని అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా చండూరులో ఏర్పాటు చేసిన మునుగోడు నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మక్క, పత్తి, వరి సాగు చేసిన రైతులు పంటలు ఎండిపోయి ఉరి వేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. వర్షాలు లేక కరెంట్ కూడా వస్తలేదని.. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చారని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఇవ్వలేక పోతుందని రైతులు అడుగుతున్నారని తెలిపారు. రైతులు కష్టాలు తెలిసిన కేసీఆర్ మళ్లీ రావాలని రైతులు కోరుతున్నారని చెప్పారు. కరెంట్ రోజుకు 5 గంటలు కూడా వస్తలేదని, వచ్చీరాని కరెంట్‌తో రైతులు కష్టాలు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే మరమ్మతు చేయడానికి 15 రోజుల సమ యం పడుతుందా? అని ప్రశ్నించారు.
రాజగోపాల్‌రెడ్డికి అభివృద్ధి పట్టదు..
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఎంతసేపూ మంత్రి పదవి పంచాయతీ, తన కాంట్రాక్టుల గొడవలు తప్ప.. మునుగోడు ప్రజల సమస్యలు పట్టడం లేదని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. తనకు కాంట్రాక్టు రాలేదని రాహుల్‌గాంధీకి లేఖ రాస్తానని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అంటున్నాడని, కానీ మునుగోడు ప్రజలకు కరెంట్, రైతుబంధు కోసం ఎప్పుడైన లేఖలు రాశారా? అని ప్రశ్నించారు. రాజగోపాల్‌రెడ్డి మూడేండ్లలో ఒక్క మంత్రిని కూడా ఇక్కడ అడుగు పెట్టనివ్వలేదని దుయ్యబట్టారు. ఆయన సొంత అన్న సహా ఎంపీని కూడా మునుగోడుకు రానివ్వడం లేదని మండిపడ్డారు. అభివృద్ధికి రూపాయి కూడా తేలేదని ధ్వజమెత్తారు. మంత్రులు హెలికాప్టర్ లేకుంటే అడుగుకూడా బయటపెట్టడం లేదని విమర్శించారు.
మళ్లీ ఫ్లోరైడ్ భూతం..
నల్లగొండలో 60 ఏండ్లలో కాంగ్రెస్ పాలనలో ఫ్లోరైడ్ బాధితులు ఎంతోమంది ఇబ్బందులు పడితే.. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఆరేండ్లలోనే దాన్ని ఖతం చేశారని జగదీశ్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ తీసుకున్న చర్యల కారణంగా నల్లగొండ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ ఈ మూడేండ్ల పాలనలో తాగు నీటిని అందించకపోవడంతో మునుగోడు, దేవరకొండ తిరిగి ఫ్లోరైడ్ ప్రాంతాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మధ్య ఫ్లోరోసిస్ కేసులు కూడా నమోదవుతున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

