Anirudh Reddy | జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్లో చేరికపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వీల్లేదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి, మూటలు తీసుకుని పోయినోళ్లకు మళ్లీ ఎంట్రీ లేదని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీకి మోసం చేసిన వారిని తిరిగి తీసుకోమని తెలిపారు. సొంత తమ్ముణ్ని సర్పంచ్ పదవి కోసం చంపారని.. ఇప్పుడు ఎమ్మెల్యే పదవి కోసం నన్ను కూడా చంపొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. జడ్ కేటగిరీ భద్రత అడగాలని.. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలని తనకు లేదని స్పష్టం చేశారు.