హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులపై 30లోగా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్యగౌడ్ ఆదివారం ప్రకటనలో డిమాండ్ చేశారు.
లేకుంటే కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ధర్నాలు, నిరసనలతో స్తంభింపజేస్తామని హెచ్చరించారు. సమస్యలపై గవర్నర్‌తోపాటు ముఖ్యమంతి, డిప్యూటీ సీఎం, మంత్రులకు ఇప్పటికే చాలాసార్లు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.