హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థల్లో పదోన్నతులను సమీక్షించాలని విద్యుత్ బీసీ, ఓసీ ఉద్యోగుల జేఏసీ సోమాజిగూడలోని విద్యుత్‌సౌధలో సోమవారం సీఎండీ రోనాల్డ్‌రోస్‌కు విజ్ఞప్తి చేశారు. రెండేండ్లుగా పదోన్నతులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగుల సీనియారిటీని మెరిట్ ప్రాతిపదికన నిర్ధారించాలని, అన్ని నిబంధనలు, కోర్టుల తీర్పులు ఇదే సూచిస్తున్నాయని చెప్పారు. సీనియార్టీలను గుర్తించని కారణంగా జూనియర్ లైన్మెన్ క్యాడర్లోనే 3,600 మందికి పదోన్నతి రావాల్సి ఉన్నదని తెలిపారు. ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ఎవరికీ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని సీఎండీ హామీ ఇచ్చినట్టు జేఏసీ నేతలు చెప్పారు.
చైర్మన్ కుమారస్వామి, కన్వీనర్ వెంకన్నగౌడ్, కో చైర్మన్ సుధాకర్‌రెడ్డి, కోకన్వీనర్ భానుప్రకాశ్, నాయకులు సంపత్‌రెడ్డి, హక్సాబ్, బ్రహ్మేంద్రరావు, శ్రీనివాస్, రాజేందర్, సదానందం, అశోక్‌కుమార్, విజయకుమార్, యాదగిరి, చంద్రుడు, సామల శివాజీ పాల్గొన్నారు. అలాగే విద్యుత్తు సంస్థల్లో పదోన్నతులు కల్పించాలని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ రోనాల్డ్ రోస్కు వినతిపత్రం అందజేసింది. టీఈ ఈ జేఏసీ చైర్మన్ ప్రకాశ్, కన్వీనర్ శివాజీ, కో చైర్మన్ అంజయ్య పాల్గొన్నారు.