సుల్తాన్‌బజార్, జూలై 19 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలిలోని భాగ్యనగర్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ మ్యూచ్‌వల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నించడంపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తీవ్రంగా మండిపడింది. జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనీ, సొసైటీ అధ్యక్షుడు, కేంద్ర సంఘం కోశాధికారి ముత్యా ల సత్యనారాయణగౌడ్, అసోసియేట్ అ ధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు తదితరులు శనివారం సచివాలయంలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సొసైటీ స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు పాగా వేయడంతో పాటు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవోస్ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ స్థలాల ను గత ఉత్తర్వు ల మేరకు బీటీఎన్జీవోస్ సొసైటీకే కేటాయించాలని మంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి కోర్టు ఉత్తర్వుల మే రకు న్యాయపరంగా సొసైటీకి దక్కాల్సిన స్థలాన్ని ఇప్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి సానుకూలంగా స్పందించినందుకు జేఏసీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు.