హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలుచేయాలని అడ్వకేట్ జేఏసీ నేత, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంట నే ఉద్యమకారులకు 250 గజాల ఇం టి స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్, ఆరోగ్య బీమా కార్డులు, గుర్తింపు కా ర్డులు ఇచ్చి ఉచిత బస్సు ప్రయాణ సౌ కర్యం కల్పిస్తామని, అమరవీరుల కు టుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చినట్టు గుర్తుచేశారు.