‘వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి’
ఉచిత వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ (ICEU) సికింద్రాబాద్ డివిజన్ జాయింట్ సెక్రటరీ, నల్లగొండ జిల్లా ఐసిఈయు కార్యదర్శి పెరుమాళ్ల బాలస్వామి పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎల్.ఐ.సి బ్రాంచ్ కార్యాలయంలో..
– ఐసీఈయూ నల్లగొండ జిల్లా కార్యదర్శి పెరుమాళ్ల బాలస్వామి
నల్లగొండ రూరల్, జూలై 22 : ఉచిత వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ (ICEU) సికింద్రాబాద్ డివిజన్ జాయింట్ సెక్రటరీ, నల్లగొండ జిల్లా ఐసిఈయు కార్యదర్శి పెరుమాళ్ల బాలస్వామి పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎల్.ఐ.సి బ్రాంచ్ కార్యాలయంలో ప్రముఖ గ్లెనెగల్స్ హాస్పిటల్ (ఫోర్టిస్ నెట్వర్క్) అలాగే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIIEA) సంయుక్త ఆధ్వర్యంలో భారీ ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కామ్రేడ్ క్లైమేంట్ దాస్ 5వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెరుమాళ్ల బాలస్వామి మాట్లాడుతూ.. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కేవలం విధులకు మాత్రమే పరిమితం కాకుండా, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోందని కొనియాడారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతంగా ఏర్పాటు చేసిన ఐసిఈయు నల్లగొండ 1, 2 బ్రాంచ్ నాయకత్వాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆరోగ్యం మీకు శ్రేయస్సు మీ కుటుంబానికి ముందస్తు పరీక్ష – మెరుగైన జీవనానికి భరోసా అనే ముఖ్య ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు.
ఈ శిబిరంలో దాదాపు 200 మందికి నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు గుండె ఆరోగ్యం, మారుతున్న జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధులపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని గుర్తు చేస్తూ నల్లగొండ పరిసర ప్రాంతాల ప్రజలు, ఎల్.ఐ.సి సిబ్బంది, వినియోగదారులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ బ్రాంచ్-2 సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఆర్.లక్ష్మా, బ్రాంచ్-1 మేనేజర్ ఏ.వెంకటేశ్వర రెడ్డి, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ సి.హెచ్.మునీందర్ రావు, నల్లగొండ 1, 2 బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు కొప్పు వెంకన్న, ఏ.కరుణాకర్ రావు, ఐతగోని లక్ష్మీనారాయణ, చిలుకూరి రమేష్, ఫెసిలిటీ డైరెక్టర్ భరత్ మల్లెంపాటి ఆధ్వర్యంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, జనరల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సత్యనారాయణ, కోఆర్డినేటర్లు వై.ఎల్. సౌజన్యరాణి, డి.వి.సుమన్, వైద్య సిబ్బంది, ఎల్.ఐ.సి సిబ్బంది, డెవలప్మెంట్ ఆఫీసర్లు,ఏజెంట్లు, పాలసీదారులు పాల్గొని వైద్య సేవలు పొందారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

