ఆర్ఎస్ ప్రవీణ్ హత్యకు కుట్ర
బండి సంజయ్-రేవంత్‌రెడ్డి ఇంటర్నల్‌గా దోస్తులని.. ఓ బాలికపై బండి భగీరథ్ చేసిన అఘాయిత్యానికి చట్టపరంగా శిక్షపడేలా బాధిత కుటుంబానికి సపోర్ట్ చేయడం వల్లే ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హత్యకు కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాంట్రాక్టర్స్ జేఏసీ చైర్మన్ మంద శ్యామ్ మండిపడ్డారు.
- రేవంత్‌రెడ్డి తమ్ముళ్లకు గన్మెన్లు ఎందుకు?
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాంట్రాక్టర్స్ జేఏసీ చైర్మన్ మంద శ్యామ్
హనుమకొండ చౌరస్తా, జూన్ 27: బండి సంజయ్-రేవంత్‌రెడ్డి ఇంటర్నల్‌గా దోస్తులని.. ఓ బాలికపై బండి భగీరథ్ చేసిన అఘాయిత్యానికి చట్టపరంగా శిక్షపడేలా బాధిత కుటుంబానికి సపోర్ట్ చేయడం వల్లే ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హత్యకు కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాంట్రాక్టర్స్ జేఏసీ చైర్మన్ మంద శ్యామ్ మండిపడ్డారు. ప్రవీణ్‌కుమార్ భద్రత తగ్గించాలని రేవంత్‌రెడ్డి చేస్తున్న రాజకీయ కుట్రను వెంటనే వెనకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు.
ఆరెస్పీకి ముప్పు ఉన్నదని గతంలో మీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే బుల్లెట్ ప్రూఫ్ కారు, ఎక్స్-కేటగిరీ గన్మెన్లను ఇచ్చారని గుర్తుచేశారు. మళ్లీ ఏ నివేదిక ప్రకారం వెనకి తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఆర్టికల్-21, 19, 14 ప్రకారం ఆయన హకులను ఉల్లంఘించేందుకు ఏ ఆర్టికల్ ఉపయోగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ పదవిలో లేని రేవంత్‌రెడ్డి తన తమ్ముళ్లు తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డికి గన్మెన్లను కేటాయించారో ప్రజలకు తెలియజేయాలని నిలదీశారు.
బులెట్‌ప్రూఫ్ కార్ తీసేసినా, గన్మెన్ల సంఖ్యను తగ్గించినా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెనుక తెలంగాణలోనే కాదు దేశం మొత్తంలో కొన్ని లక్షల మంది గన్మెన్లు ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో జాక్ హనుమకొండ ప్రెసిడెంట్ బొల్లె మధుకర్, ఒంటేరు చక్రపాణి, లీగల్ సెల్ కన్వీనర్ మారపల్లి మనోజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి తెల్లారి సురేశ్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు దూడల సిద్ధు, ఉపాధ్యక్షుడు మహిపాల్, కార్యదర్శి రవి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

