హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): సంతానం కలగని దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఐవీఎఫ్, సరోగసి సెంటర్ల దందాపై ప్రభుత్వంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. సికింద్రాబాద్ ‘యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్’ గుట్టురట్టు కావడంతో ఇ లాంటి సెంటర్ల అక్రమాలను వెలికి తీసేందుకు అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. సోమవారం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ అ ధికారులతో అత్యవసర సమీక్ష సమీక్ష నిర్వహించారు. సరోగసీ, ఐవీఎఫ్ కేంద్రాలు, పనితీరు, అక్రమాలు, అధికారుల నిర్లక్ష్యంపై చర్చ జరిగిన ట్టు సమాచారం. ఎలాంటి అనుమతులు లేకుం డానే దందాలు కొనసాగుతున్నట్టు గుర్తించి వెంటనే తనిఖీలకు నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
సరోగసీపై హెచ్చార్సీ సీరియస్
సరోగసీ పేరిట సికింద్రాబాద్‌లోని దంపతులను మోసం చేసిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. వార్తా కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసి విచారణకు స్వీకరించింది. ఆగస్టు 28లోగా నివేదిక ఇవ్వాలని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యదర్శిని కోరింది.
ఫుడ్ పాయిజనింగ్‌పై సైతం..
నాగర్‌కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ సమీపంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై కూడా ఆగస్టు 28లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని మాన వ హక్కుల కమిషన్ సీఎస్‌ను కోరింది.