అబద్ధంయాదగిరిగుట్ట ఆగ్నేయ దిశలోని రక్షణ గోడ నుంచి నీరు లీక్ అవుతున్నది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగింది.
వాస్తవం
దక్షిణ ప్రహరీ నుంచి నీళ్లు లీకేజీ అవుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని వైటీడీఏ అధికారులు తేల్చిచెప్పారు. ప్రహరీ వద్దకు చేరిన నీళ్లు వీప్ హోల్స్ ద్వారా బయటకు వెళ్తున్నాయని, దాంతో రక్షణగోడ, ఆలయానికి ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. పెద్దపెద్ద కట్టడాలు, భవనాలు నిర్మించినప్పుడు వృత్తాకారంలో చిన్న ద్వారాలు (వీప్ హోల్స్) ఏర్పాటు చేస్తారని తెలిపారు. యాదాద్రి ప్రధానాలయం మాఢవీధులను మట్టితో నింపి ఎత్తు పెంచారు. ఎక్కడైనా మట్టిలోకి నీళ్లు చేరిన్నప్పుడు అవి నిల్వ ఉండకుండా బయటకు పంపేందుకు వీప్ హోల్స్‌ను నిర్మించారు. నిర్మాణం బలంగా, స్థిరంగా ఉండేందుకు వీప్ హోల్స్ సహాయపడతాయని స్పష్టంచేశారు.