హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఐటీఐలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)లో అడ్మిషన్లకు ఆసక్తి గలవారు https:// iti.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని ఉపాధి కల్పనశాఖ జేడీ ఎస్వీకే నగేశ్ తెలిపారు.
ఈ నెల 31లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని, 28 నుంచి ఆగస్టు 1 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఆగస్టు 5న సీట్ల కేటాయింపు, ఆగస్టు 6 నుంచి 12లోగా జాయినింగ్ రిపోర్ట్ చేయాలని సూచించారు.