హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ప్రముఖ వ్యాపారి బొల్లా రామకృష్ణకు చెందిన ఇండ్లు, కార్యాలయాల్లో మంగళవారం ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కూకట్పల్లి, బంజారాహిల్స్ చెక్పోస్ట్, మాదాపూర్, బషీర్బాగ్లో తెల్లవారు నుంచే జరిగిన ఈ సోదాల్లో 10 ఐటీ బృందాలు పాల్గొన్నాయి. కూకట్పల్లి రెయిన్బో విస్టాలోని రామకృష్ణ నివాసం, బషీర్బాగ్ పైగా ప్లాజాలోని ఫైనాన్స్ కంపెనీ కార్యాలయంలో అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చే సుకున్నారు. స్టార్ పవర్ సంస్థ డైరెక్టర్ రాజేశ్ ఇంటిలోనూ సోదాలు జరిగాయి. రామకృష్ణ ఆదాయ పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఐటీ అధికారులు చెప్తున్నారు.