హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : ఐటీ రియల్ లైఫ్ ‘బంటీ ఔర్ బబ్లీ’ కేసులో హన్సిక, అనిల్‌కుమార్ మహంతి రెండ్రోజుల క్రితం భువనేశ్వర్‌లో అరెస్ట్ అ య్యారు. వీరు ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ అల్లుడు, కూతురిగా చెప్పుకుంటూ పలుచోట్ల వసూళ్లకు పాల్పడ్డారు. ప్రభుత్వం ద్వారా ప నులు చేయిస్తామంటూ పలు కంపెనీల నుంచి 100 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేశారన్న సమాచారంతో బుధవారం ఆంధ్రా, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా 12ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏపీ, భువనేశ్వర్, ఢిల్లీ, జార్ఖండ్, హైదరాబాద్‌లో నాలుగుచోట్ల సోదాలు జరిగాయి. నిందితులు లగ్జరీ కార్లు, అధునాతన విల్లాలు కొనుగోలు చేసినట్టు గుర్తించారు.