హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): సినీప్రముఖుల ఇండ్లు, కార్యాలయాలలో ఆదాయపన్నుశాఖ అధికారులు 4 రోజుల పాటు జరిపిన దాడులు శుక్రవారం ముగిశాయి. దిల్ రాజు ఇంట్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. దిల్ రాజు కుమార్తె హన్సితారెడ్డి, సోదరులు, బంధువులు, ఫైనాన్స్ ఇస్తున్న వ్యక్తుల ఇండ్లు, కార్యాలయాల్లోనూ అధికారులు సోదాలు చేశారు. నిర్మాతలు నవీన్, రవిశంకర్, డైరెక్టర్ సుకుమార్, మైత్రీ సీఈవో చెర్రీ, మ్యాంగో మీడియా ప్రతినిధి రామ్ సహా మొత్తం 18చోట్ల 55 మంది అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లు, హార్డ్డిస్లు, ఆడిట్ రిపోర్టులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తున్నది.