హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ(ఈఎస్డీ) రూపొందించిన ‘మీ టికెట్’ యాప్‌ను ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు గురువారం సచివాలయంలో ప్రారంభించారు.
ఈ యాప్ ద్వారా ఆర్టీసీ, మెట్రో ప్రయాణం, తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, పారులు, పర్యాటక ప్రాంతాల ప్రవేశాలకు టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ బుకింగ్‌లకు యూపీఐ ద్వారా అదనపు చార్జీలు ఉండవని చెప్పారు. ఇలాం టి మరిన్ని యాప్‌లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మీ-సేవ కమిషనర్ రవికిరణ్, పరిశ్రమలశాఖ కమిషనర్ జీ మల్సూర్, జూపార్స్ డైరెక్టర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.