హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): పుడమి తల్లికి వెలకట్టలేని ఆభరణం హరితహారం అని ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. దశాబ్దాలపాటు ధ్వంసమైన పర్యావరణానికి వరం హరితహారం అన్నారు. తెలంగాణ హరితహారం మహోద్యమంలా సాగుతున్నదని తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆహ్లాదకర వాతావరణంలో హరితోత్సవం కొనసాగింది. ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. హరితోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్, హరితహారం పార్కుల ఛాయాచిత్రాలను జత చేసి తన స్పందనను తెలియజేశారు.
దశాబ్దాల పాటు ధ్వంసమైన పర్యావరణానికి వరం
మహోద్యమంలా సాగుతున్న తెలంగాణ హరితహారం
230 కోట్ల మొక్కలు నాటాలన్న సమున్నత సంకల్పం
ప్రపంచ చరిత్రలోనే ఇది మూడో అతిపెద్ద మానవ ప్రయత్నం
33 శాతం గ్రీన్ కవర్ ఆశయం.. పుడమితల్లికి వెల కట్టలేని ఆభరణం.