BJP | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): బీజేపీ అన్నంత పనీ చేసింది..! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న అభిప్రాయమిది. ఏడాదిన్నరగా కొనసాగుతున్న ఢిల్లీ లిక్కర్ కేసులో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒక్కరోజు ముందే కవితను ఈడీ అరెస్ట్ చేయ టం వెనుక కచ్చితంగా రాజకీయ కుట్ర ఉన్నదని చర్చించుకుంటున్నారు.
కవితను ముందు సాక్షిగా పేర్కొన్న ఈడీ.. ఉన్నట్టుండి నిందితురాలిగా మార్చటంలో బీజేపీ ప్రమే యం ఉన్నదని అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచీ ఆ పార్టీలోని కీలక నేతలు చేసిన బహిరంగ ప్రకటనలే నిదర్శనం. బీఆర్ఎస్ను నైతికంగా, భౌతికంగా దెబ్బతీయటమే లక్ష్యంగా కవితను అరెస్టు చేశారన్న చర్చ ప్రజల్లో జోరుగా సాగుతున్నది.