Koyna project | కొయినా నీళ్లపై సర్కారు డైలమా.. ఎట్టకేలకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి
తాగునీటి కోసం మహరాష్ట్ర, కర్ణాటకను సంప్రదించాలని ఉరుకులు పెట్టిన కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఆ దిశగా వివరాలను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.
- అందుకు సంబంధించిన వివరాల సేకరణ
- ఇరిగేషన్ అధికారులతో సీఎస్ ప్రత్యేక సమీక్ష
Koyna project | హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): తాగునీటి కోసం మహరాష్ట్ర, కర్ణాటకను సంప్రదించాలని ఉరుకులు పెట్టిన కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఆ దిశగా వివరాలను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. కృష్ణా బేసిన్లో నీటికొరత ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారును సంప్రదించి కొయినా డ్యామ్ నుంచి 30 టీఎంసీలు, కర్ణాటక సర్కారును సంప్రదించి 10 టీఎంసీలను కోరాలని సర్కారు నిర్ణయించింది. అందుకు సంబంధించి ప్రతిపాదనలను సైతం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే కోయినా నుంచి నీళ్లు తెచ్చుకోవడం పెద్ద సవాల్ అని, ఖర్చుతో కూడిన వ్యవహారంతోపాటు, అందే ప్రయోజనాలు తక్కువేనని అధికారులు సర్కారుకు నివేదించారు.
రాష్ట్రంలోనే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం సచివాలయంలో సాగునీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ఈఎన్సీ మురళీధర్‌తో ప్రత్యేక సమీక్ష నిర్వహించారని సమాచారం. తాగునీటిని అందించేందుకు రాష్ట్రంలో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై పూర్తి సమాచారాన్ని అందించాలని ఆదేశించారని తెలుస్తున్నది. గతంలో సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి ఎన్ని నీళ్లను వినియోగించుకున్నాం? ఏయే సందర్భాల్లో ఏ మేరకు జలాలను ఎత్తిపోసుకున్నాం? అందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలపై పూర్తిస్థాయి వివరాలను అందివ్వాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టి హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులను సంప్రదించినట్టు తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

