సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల బతుకులతో చెలగాటమాడుతున్నదని టీఏటీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య మండిపడ్డారు. నాచారంలో బుధవారం జరిగిన ఆటో డ్రైవర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహాలక్ష్మి ఉచిత బస్సు స్కీమ్‌తో ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందని వ్యక్తంచేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. జూన్ రెండో వారంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.