Minister KTR | నేడు పాలమూరుకు మంత్రి కేటీఆర్
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ కారిడార్‌ను ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు. అక్కడే ఎనిమిది కంపెనీల ప్రతినిధులతో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఎంవోయూలు కుదుర్చుకుంటారు.
- ఐటీ టవర్ ప్రారంభోత్సవం
- అమరరాజా బ్యాటరీ కంపెనీకి ఐటీశాఖ మంత్రి శంకుస్థాపన
- బాలుర కళాశాల మైదానంలో బహిరంగ సభ
Minister KTR | మహబూబ్‌నగర్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ కారిడార్‌ను ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు. అక్కడే ఎనిమిది కంపెనీల ప్రతినిధులతో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఎంవోయూలు కుదుర్చుకుంటారు. ఆయా కంపెనీలకు ఐటీ టవర్‌లో స్థలాన్ని కేటాయిస్తారు. అనంతరం కారిడార్ వెనుక భాగంలో సుమారు 270 ఎకరాల్లో నిర్మించనున్న అమరరాజా లిథియం బ్యాటరీ కంపెనీకి శంకుస్థాపన చేస్తారు.
అనంతరం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, బ్యాటరీ కంపెనీ ప్రతినిధులతో సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కేంద్రంలోని పలు జంక్షన్లను ప్రారంభిస్తారు. అనంతరం బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ ముగిసిన వెంటనే మినీ ట్యాంక్‌బండ్ వద్ద నిర్మించనున్న ఐల్యాండ్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసి శిల్పారామాన్ని ప్రారంభిస్తారు.
దేశంలోనే అతి పెద్దదైన కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో జంగల్ సఫారీని ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. కాగా, మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నర్సింహగౌడ్‌తో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం పరిశీలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

