హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నియంత్రణలో భాగంగా గతంలో నిలిపివేసిన శ్రీవారి సర్వదర్శనం ఆఫ్లైన్ టోకెన్ల జారీని టీటీడీ మంగళవారం నుంచి తిరిగి ప్రారంభించనున్నది. 16వ తేదీ దర్శనం కోసం మంగళవారం ఉదయం 9 గంటలకు టోకెన్లు జారీచేస్తారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీగోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసే కౌంటర్ల ద్వారా రోజుకు 10 వేల టోకెన్లను జారీ చేయనున్నారు.