హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): బీఎస్సీ నర్సింగ్, పీబీ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు ‘మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్’ (ఎంఎల్హెచ్పీ) సర్టిఫికెట్లు జారీ చేయాలని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్సీ) సూచించింది. ఈ మేరకు అన్ని హెల్త్ వర్సిటీలకు లేఖలు పంపింది.
నిరుడు నుంచి ఎంఎల్హెచ్పీ కోర్సును బీఎస్సీలో అంతర్భాగంగా బోధిస్తున్నారు. కానీ, ప్రత్యేకంగా సర్టిఫికెట్లు జారీ చేయడం లేదు. దీంతో ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్న సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వారికి విడిగా సర్టిఫికెట్లు జారీ చేయాలని ఐఎన్సీ సూచించింది.