హైదరాబాద్: కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (MLA Medipally Sathyam) సతీమణి రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం రాత్రి అల్వాల్‌లోని పంచశీల కాలనీలోని ఇంట్లో బలన్మరణం చెందారు. ఆమె మృతదేహాన్ని పోలీసులు గాంధీ దవాఖానకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. కాగా, ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నది. అయితే ఆమె అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారించారు.
రూపాదేవి గత రెండేండ్లుగా కడుపు నొప్పుతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ కారణంగానే రెండు రోజులుగా స్కూల్‌కి సెలవు తీసుకుని ఇంట్లోనే ఉంటున్నారని పోలీసులకు తెలిపారు. ఆమె చనిపోయినప్పుడు తాము ఇంట్లోనే ఉన్నట్లు రూపాదేవి తల్లి, కుమారుడు, కుమార్తె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆసమయంలో ఎమ్మెల్యే సత్యం నియోజకవర్గంలో ఉన్నారని చెప్పారు. కాగా, భార్య మృతి వార్త తెలిసుకున్న ఎమ్మెల్యే సత్యం.. రక్తపోటు తగ్గి దవాఖానలో చేరారు.