High Court | హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): పాఠశాల అడ్మిషన్, బదిలీ సర్టిఫికెట్లో కులం, మతం ప్రస్తావన లేకుండా రికార్డులు రూపొందించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ విధానమేమిటో తెలియజేస్తూ కౌంటరు దాఖలు చేయాలంటూ హైకోర్టు గురువారం ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. విచారణను జూలై 2కు వాయిదా వేసింది. పాఠశాల అడ్మిషన్, బదిలీ సర్టిఫికెట్లలో తల్లిదండ్రుల కులం, మతం పేరొనాలన్న నిబంధనను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన డీవీ రామకృష్ణ పిల్ వేశా రు.
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై ఇప్పటికే కేంద్రం కౌంటరు దాఖలు చేస్తూ జనాభా గణన సమయంలో కుల, మతా ల వారీగా సేకరించిన గణాంకాలు నిత్య జీవితంలోగానీ, పాఠశాల రికార్డుల్లోగానీ ఎందుకూ ఉపయోగపడవని పే రొంది. వాటిని ఉంచాలా లేదా అన్నదానిపై రాష్ట్రప్రభుత్వం కౌంటరు దాఖలు చేయడానికి గడువు కావాలని అదనపు అడ్వకేట్ జనరల్ కోరగా ధర్మాసనం అనుమతిస్తూ విచారణను వాయిదా వేసింది.