హైదరాబాద్ : రాష్ట్రంలో మరో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. ఆదిలాబాద్‌లో నీటిపారుదల ( Irrigation ) శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విట్టల్( Rathod Vittal ) , అసిస్టెంట్ ఇంజనీర్ ప్రకాష్( Prakash) లను ఏసీబీ (ACB ) ఆదిలాబాద్ రేంజ్ ట్రాప్ బృందం గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. సుమారు రూ.60 వేలు ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్‌లోని నేరేడ్మెట్లో ఉన్న ఈఈ నివాసంలో సోదాలు నిర్వహిస్తోంది.