IRCTC Tourism | మెదక్, (నమస్తే తెలంగాణ)/సిద్దిపేట/సంగారెడ్డి కలెక్టరేట్, మే 27: తీర్థ యాత్రలకు వెళ్లే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. జూన్ 14 నుంచి జూలై 13వ తేదీ వరకు రెండు ప్యాకేజీలుగా ఈ రైళ్లను హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ డీఎస్‌జీపీ కిశోర్ తెలిపారు.
ప్యాకేజీ 1: (గంగా రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర-SCZBG44): ఈ యాత్రలో (కాశీ) వారణాసి / అయోధ్య / నైమిశారణ్య / ప్రయాగ్‌రాజ్ / శృంగవర్పూర్ ప్రాంతాలు దర్శించుకోవచ్చు. ఈ యాత్ర జూన్ 14న ప్రారంభమై 22వ తేదీ వరకు ఉంటుంది. దీ నికి ఒకొకరికి సాధారణ టికెట్టు రూ.16200, 3 ఏసీ రూ.26500, 2 ఏసీ రూ.35000 ఉంటుంది.
ప్యాకేజీ 2: (ఐదు జ్యోతిర్లింగాల యాత్ర – SCZBG43): ఉజ్జయిని (మహా కాళేశ్వర్ – ఓంకారేశ్వర్), త్రయంబకేశ్వర్ – భీమశంకర – ఘృష్ణేశ్వర్). ఈ యాత్రలో మహా కాళేశ్వర్ / ఓంకారేశ్వర్ / త్రయంబకేశ్వర్ / భీమశంకర్ / ఘృష్ణేశ్వర్ / ఎల్లోరా / మోవ్/ నాగ్‌పూర్ ప్రాంతాలు సందర్శించవచ్చు. ఈ యాత్ర జూలై 5న ప్రారంభమై 13వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒకొకరికి సాధారణ టికెట్టు రూ.14700, 3 ఏసీ రూ.22900, 2 ఏసీ రూ.29900 ఉంటుంది.
సౌకర్యాలు: రైలు, బస్సు, హోటల్, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం), వాటర్ బాటిల్, టూర్ ఎసాట్ సేవలతో సందర్శనా స్థలాలు, (అదనపు ఖర్చు లేదు), ప్రయాణ బీమా, రైల్వేస్టేషన్ నుంచి ఆలయాలకు ప్రయాణం పూర్తిగా ఉచితం. ప్రతి రైలులో 718 మంది ప్రయాణికులు ఉంటారు. ప్రతి 70 మందికి ఇద్దరు కోర్డినేటర్లు అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు సమకూరుస్తారు. కోచ్‌కు ఒక సెక్యూరిటీ గార్డ్, రైలులో సీసీ కెమెరాలతో కూడిన భద్ర త ఉంటుందని తెలిపారు. వివరాలకు 97013 60701, 9281030712, 92814 95845, 9281030749, 92810 30750లకు సంప్రదించాలని తెలిపారు.