e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home టాప్ స్టోరీస్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ

  • ఆమోదించాలని ప్రభుత్వానికి దరఖాస్తు
ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ

హైదరాబాద్‌, జూలై 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తుచేశారు. 26 ఏండ్ల సర్వీస్‌ పూర్తిచేసిన ఈ ఐపీఎస్‌ అధికారి ప్రస్తుతం అడిషనల్‌ డీజీ ర్యాంక్‌లో ఉన్నారు. ఇంకా ఆరేండ్ల సర్వీసు ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోమవారం ట్విట్టర్‌లో వెల్లడించారు. తన నిర్ణయాన్ని ప్రభుత్వ కార్యదర్శికి ఈ మెయిల్‌ ద్వారా తెలియజేసినట్టు పేర్కొన్నారు. తనపై నమ్మకంతో పలు బాధ్యతలు అప్పగించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. సంక్షేమభవనంలో ఈ తొమ్మిదేండ్లు తొమ్మిది నిమిషాలుగా గడిచిపోయిందని పేర్కొన్నారు. పదవీవిరమణ త ర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు, బీఆర్‌ అంబేద్కర్‌, కాన్షీరాం మార్గంలో పేదలకు అండగా ఉంటానని పేర్కొన్నారు.

హుజురాబాద్‌లో పోటీచేయను
హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశం తనకు లేదని ప్రవీణ్‌కుమార్‌ స్పష్టంచేశారు. రాజకీయ ప్రవేశంపై ఇప్పుడే చెప్పలేనని తెలిపారు.

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ
ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ
ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ

ట్రెండింగ్‌

Advertisement