Kona Venkat | హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): దళిత యువకుడిపై దాడి చేశారనే ఆరోపణలతో సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో కేసు నమోదైంది. గణపరానికి చెందిన ఎస్సీ నేత కత్తి రాజేశ్ వైఎస్సార్ సీపీకి రాజీనామా చేశారు. రాజేశ్ తన అనుచరులతో కలిసి శనివారం టీడీపీలో చేరారు. రాజేశ్ తమ దగ్గర రూ.8లక్షలు తీసుకున్నారని, ఇప్పుడు సడన్‌గా టీడీపీలో చేరారని వైఎస్సార్ సీపీ నేతలు కర్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎస్సై చాంబర్లో బాపట్ల వైఎస్సార్ సీపీ నేత కోన రఘుపతి బంధువైన కోన వెంకట్, వైఎస్సార్ సీపీ నేతలు తనపై దాడి చేశారని రాజేశ్ పేర్కొన్నారు. ఎస్సై కూడా తనను కొట్టారని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను వైఎస్సార్ సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాననే అకసుతో టార్గెట్ చేశారని ఆరోపించారు. రాజేశ్, అతడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సినీ రచయిత వెంకట్‌పై కర్లపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.