IAS Uma Harathi | హైదరాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీస్ అకాడమీలో శనివారం అధికారిక విధుల్లో భాగంగా ఓ తండ్రి తన కూతురికి సెల్యూట్ చేసిన అరుదైన ఘటన చోటుచేసుకుంది. ట్రైనీ ఐఏఎస్‌గా వచ్చిన తన కూతురికి అక్కడే డీడీగా విధులు నిర్వహిస్తున్న తండ్రి పూలబొకే ఇచ్చి సెల్యూట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్‌లో ట్రైనీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఉమాహారతి తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రొబేషన్‌లో భాగంగా శిక్షణలో పాల్గొనేందుకు శనివారం ఆమె తెలంగాణ పోలీస్ అకాడమీ (టీజీపీఏ)ని సం దర్శించారు. ఈ సందర్భంగా ఆమె తండ్రి, టీఎస్పీఏ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. తన కూతురు ఉమాహారతి అక్కడికి రావడంతో చిరునవ్వు నవ్వుతూ ఆమె కు పూలబొకే అందజేసి సెల్యూట్ చేశారు. ఇది చూసి అక్కడివారంతా ఆనందానికి లోనయ్యారు.