హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): వరంగల్లోని టీఎస్ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్లలో సంస్థ శిక్షణ ఇవ్వనున్నది. రెండేండ్ల పాటు కొనసాగే ఈ కోర్సుకు పది, ఎనిమిదో తరగతి చదివిన వారు అర్హులని పేర్కొన్నది. దరఖాస్తులను ఈ నెల 31లోగా పంపాలని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొన్నది. మోటర్ మెకానిక్, డీజిల్ మెకానిక్, వెల్డర్, పెయింటర్ ట్రెడ్లలో ప్రవేశాలు జరగనున్నాయి. నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవం గల ఆర్టీసీ అధికారులతో తరగతులను నిర్వహించనున్నారు. ఆయా ట్రేడ్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీస్షిఫ్ సౌకర్యం కల్పిస్తారు. ప్రవేశాల కోసం వరంగల్ ములుగు రోడ్డులోని ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో లేదా, 984925319, 8008136611 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నది.