హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు(2025) సన్నద్ధమయ్యే అభ్యర్థులకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ రాజేంద్రనగర్లోని ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆబ్జెక్టివ్ విధానంలో ఆప్టిట్యూడ్ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపికను చేపట్టనున్నట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలు మించకూడదని, ఈనెల 13 నుంచి 30లోపు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు http:// study circle.cgg.gov.in,http:// twd. telangana.gov.in వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు.