మహబూబ్నగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కోస్గి, జూలై 31 : స్వయంగా సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కొత్తగా పెండ్లయిన జం టలకు చెల్లని కల్యాణక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం విమర్శలకు దారితీసింది. చెక్కు లు అందుకున్న లబ్ధిదారులు సంబురం నుంచి తేరుకోకముందే బ్యాంక్ అధికారు లు ఈ చెక్కులు చెల్లవంటూ తిప్పి పంపడంతో కాంగ్రెస్ నేతల నిర్వాకం బయటపడింది. గడువు ముగిసిన చెక్కులను పంపి ణీ చేసి లబ్ధిదారులను మోసం చేసిన కాం గ్రెస్ నేతల ఘనకార్యంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. వివరాలిలా ఉన్నా యి. నారాయణపేట జిల్లా గుండుమల్లో శుక్రవారం కొడంగల్లో సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి హంగూ ఆర్భాటాల నడుమ కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అవి కాలం చెల్లిన చెక్కులని కాంగ్రెస్ నేతలకు అధికారులు సమాచారం ఇచ్చినా..
అంతా తామే చూసుకుంటామంటూ ‘బిగ్ బ్రదర్’ను పిలిపించారు. కొడంగల్ నియోజకవర్గంలో అది అధికారిక కార్యక్రమమైనా.. పార్టీ కార్యక్రమమైనా.. తిరుపతిరెడ్డి కనుసన్నల్లోనే అంతా కొనసాగుతుంది. పంపి ణీ చేసిన 78 చెక్కుల్లో 69 చెక్కులకుపైగా మూడు నెలల సమయం గడిచిపోయింది. మూడు, నాలుగు నెలల నుంచి లబ్ధిదారు లు తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ చెక్కులు ఇవ్వాలని ప్రాధేయపడినా కాంగ్రె స్ నేతలు చెబితేనే ఇస్తామని చేతులు దులుపుకొన్నారు. అప్పులు చేసి పెండ్లి చేసి చివరకు చెక్కుల కోసం నెలలుగా వేచిచూడా లా? అంటూ లబ్ధిదారులు వాపోయారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి లబ్ధిదారులకు చెల్లని చెక్కులను అందించిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ నేతల వల్లే లేట్ అయ్యింది గడువు ముగిసిన చెక్కులను పంపిణీ చేసిన మాట వాస్తవమే. కాంగ్రెస్ నేతలు టైమ్ ఇవ్వకపోవడం వల్లే లేట్ అయింది. లబ్ధిదారులకు ఇచ్చిన చెక్కులను తీసుకొని మళ్లీ కొత్త చెక్కులు ఇస్తాం.
– భాస్కర్, తహసీల్దార్, గుండుమాల్