Congress Govt | కుట్టు పైసల్లోనూ కత్తిరింపు.. స్వశక్తి మహిళలకు సర్కారు ధోకా?
విద్యార్థుల యూనిఫామ్ దుస్తుల కుట్టు కూలీ ఒక జతకు రూ. 50 నుంచి రూ. 75కు పెంచుతూ జీవో ఇచ్చినా.. ప్రభుత్వం డబ్బులు మాత్రం ఇంకా చెల్లించలేదు.
- మాట తప్పిన రేవంత్రెడ్డి సర్కార్
- దుస్తుల కుట్టు కూలీ రూ. 50 చెల్లింపు
- రూ.75కు ధర పెంచుతూ జీవో
- ఎస్ఎస్ నిధులు మాత్రమే విడుదల
- అదనంగా రూ.25 చెల్లిస్తారా? లేదా?
- సర్కార్ తీరుపై మహిళల అసహనం
Congress Govt | కరీంనగర్, జూలై 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): విద్యార్థుల యూనిఫామ్ దుస్తుల కుట్టు కూలీ ఒక జతకు రూ. 50 నుంచి రూ. 75కు పెంచుతూ జీవో ఇచ్చినా.. ప్రభుత్వం డబ్బులు మాత్రం ఇంకా చెల్లించలేదు. దుస్తులు చేతికందగానే సమగ్ర శిక్ష ద్వారా కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు మాత్రమే విడుదల చేసి, రేయింబవళ్లు కష్టపడ్డ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం చేయిచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివే విద్యార్థులకు పంపిణీ చేసే యూనిఫామ్ దుస్తుల కుట్టు పని ప్రభుత్వం మహిళా సంఘాలకు అప్పగించింది.
ఒక్కో జతకు 50 చొప్పున చెల్లించడానికి ఒప్పందం చేసుకోగా, కుట్టుపనులకు అవసరమయ్యే ముడి సామగ్రికే ఆ మొత్తం సరిపోదని మహిళా సంఘాలు తెల్చిచెప్పాయి. మార్చి 12న సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన మహాలక్ష్మి మహిళా సమ్మేళనంలో కుట్టు కూలీ పెంచాలని కోరుతూ.. మహిళా సంఘాల సభ్యులు సీఎం రేవంత్రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఆ మేరకు స్పందించిన సీఎం రేవంత్ కేంద్రం నుంచి విడుదలయ్యే కుట్టుకూలీకి అదనంగా మరో 25 రాష్ట్ర ప్రభుత్వం కలిపి జతకు 75 చెల్లిస్తుందని వారికి హామీ ఇచ్చారు.
ఆవెంటనే ఉత్తర్వులు జారీచేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని ఆదేశించారు. 2024-25 విద్యాసంవత్సరం నుంచే పెంచిన చార్జీలను వర్తింప చేస్తామని, వెంటేనే ఆ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని, జూన్7న జీవోనం 39ని సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు విడుదల చేశారు. ధరల పెంపుతో మహిళలంతా సంబురంగా పని పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,009 స్కూళ్లలోని 18,58,841 మంది విద్యార్థులకు ఒక్కో జత చొప్పున ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా కుట్టి దుస్తులు అందించారు. వీరికి కుట్టు కూలీ కింద రూ.13,94,13,075 చెల్లించాల్సి ఉంది. అయితే, కుట్టు కూలీ కింద సమగ్రశిక్ష నుంచి విడుదలైన మొత్తంలో నుంచి జతకు 50 చొప్పున మాత్రమే డబ్బులు విడుదల చేసింది.
9,29,42,050 మాత్రమే చెల్లింపు చేస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం చూస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా సమగ్ర శిక్ష నుంచి వచ్చిన 50కి మరో 25 జతచేసి 75 ఒకేసారి మొత్తాన్ని విడుదలచేయాల్సి ఉన్నది. కానీ, సమగ్ర శిక్ష నుంచి వచ్చిన నిధులను మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 4,64,71,025 పెండింగ్లో పెట్టడంపై దుస్తులు కుట్టిన మహిళలంతా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా ఇప్పట్లో చెల్లిస్తుందా..? లేదా..? అన్నదానిపై ఏ అధికారి వద్ద స్పష్టమైన సమాధానం లేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

